‘ఎన్డీఆర్‌ఎఫ్‌’ ఎంతో గర్వకారణం

10 Jan, 2017 01:21 IST|Sakshi
‘ఎన్డీఆర్‌ఎఫ్‌’ ఎంతో గర్వకారణం

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి
కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్స్‌కు శంకుస్థాపన


సాక్షి, అమరావతి: జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఆర్‌ఎఫ్‌)ను స్థాపించిన పదేళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని పొందిందని, ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉందనే ధీమా ప్రజల్లో పెరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కృష్ణా జిల్లా కొండ పావులూ రులో 50 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ పదవ బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్స్‌ కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత సభలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ అనతి కాలంలోనే అతి పెద్ద ఫోర్సుగా అవతరిం చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ దేశానికే గర్వకారణమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏపీకి సీఆర్‌పీఎఫ్‌ బలగాల ను తరలించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఏపీలో గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రాన్ని, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ విభాగం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలు మరువలేనివి..
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ  రెండున్నరేళ్లు అయినా తెలంగాణ, ఏపీ అస్తుల పంపకం తేలలేదని, అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఏపీకి కొత్తగా కేన్సర్‌ సంస్థ..
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 20 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లతో కొత్తగా క్యాన్సర్‌ సంస్థలను ఏర్పాటు చేçస్తుంటే వాటిలో ఒకటి ఏపీకి కేటాయిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్‌ నడ్డా చెప్పారు.  విశాఖ చినవాల్తేరు మానసిక ఆస్పత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కేంద్రాన్ని(సీజీహెచ్‌ఎస్‌) మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్య మూలాలను తెలుసుకునేందుకు నేషనల్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణుల ద్వారా పరిశోధన చేయించనున్నట్టు వెల్లడించారు.

అవసరమైతే ఇక్కడ మరో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఢిల్లీలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న టెలీ కన్సల్టెన్సీ, టెలీ మెడిసిన్‌ విధానాన్ని మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ   గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే జోన్‌లు కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయన్నారు.

మరిన్ని వార్తలు