పెట్టుబడులకు ఏపీ అనుకూలం

7 Nov, 2019 16:02 IST|Sakshi

విశాఖలో  బిమ్స్‌టెక్‌ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీలో దుగరాజపట్నం, రామయ్యపట్నంలలో పోర్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరామని..రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండింటిలో ఒక చోట జాతీయ పోర్టు నిర్మాణం చేపడతామని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి మన్షూక్ మాండవియా తెలిపారు. బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏడు దేశాలతో పోర్టుల అభివృద్ధిపై రెండు రోజుల బిమ్స్ టెక్ అంతర్జాతీయ సదస్సు విశాఖ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మన్షూక్ మాండవియా మాట్లాడుతూ..  బిమ్స్ టెక్ లో భారతదేశం పాత్ర అత్యంత కీలకమైందని...ఏడు దేశాల మధ్య పోర్టుల అభివృద్ధి, ఎగుమతులలో సహాయ సహకారాలపై చర్చించి పరస్పర అంగీకార నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బంగ్లాదేశ్-ఇండియా మధ్య పరస్పర ఒప్పందాల కారణంగా నేరుగా ఎగుమతులకి అవకాశం ఏర్పడిందని వివరించారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ఫిబ్రవరిలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఐఐటి ఖరగ్పూర్ లో పోర్టుల అభివృద్ధి పై వెయ్యి కోట్లతో అత్యాధునిక పరీక్షల సాంకేతిక ల్యాబరేటరీ ఏర్పాటు చేశామన్నారు. సాగర్మాల యోజన లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 73 ప్రాజెక్ట్ ల అభివృద్ధి చేపడుతున్నామన్నారు.

పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రం..
పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్‌ అనువైన రాష్ట్రమని...తమ ప్రభుత్వం పెట్టుబడుదారులకి సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తామని ఏపీ మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు తెలిపారు. విశాఖ నగరం పర్యాటకంగా...ఆర్థికంగా పెట్టుబడులకి అవకాశమన్నారు. ఈ సదస్సులో భాగంగా పోర్టుల అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధి, టూరిజం అభివృద్ధి, సెక్యూరిటీ,సేఫ్టీ కి సంబంధించిన అంశాలపై ఏడు దేశాల ప్రతినిధులు చర్చించారు.

బంగాళాఖాతం అనుకుని ఉన్న దేశాల మధ్య బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక క రంగాల సమన్వయంపై ఈ సదస్సు చర్చకు వేదికగా మారింది. 1997 లో  బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ లు సభ్య దేశాలుగా బిమ్స్‌ టెక్  ప్రారంభమైంది. బిమ్స్ టెక్ ప్రారంభమైన 32 సంవత్సరాల తర్వాత తొలిసారి విశాఖ పోర్టు ఇందుకు ఆతిథ్య మిస్తోంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహనరావు, ఏడు దేశాల ప్రతినిధులు, ప్రైవేట్ పోర్టుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కంచే చేను మేసిందన్నట్లుగా వ్యవహరించారు’

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

‘ఏపీలో పెట్టుబుడులకు అదానీ గ్రూప్‌ సిద్ధంగానే ఉంది’

‘గత ప్రభుత్వం ఉపశమన కమిటీ పేరుతో కాలయాపన చేసింది’

‘అభివృద్ది, సంక్షేమం ఆయనకు రెండు కళ్లు’

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ

దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!

‘చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు’

‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’

ముఖ్యమంత్రిని కలిసిన కమలాపురం ఎమ్మెల్యే

ఇసుక దీక్షా...కార్తీక ఉపవాసమా?

టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా

ఇసుక సమస్యకు చెక్‌ 

పెను తుపాన్‌గా మారుతున్న ‘బుల్‌బుల్‌’

నేటి విశేషాలు..

హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు

మిషన్‌ కర్నూలే ఎజెండా 

కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ

ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

విశిష్ట సేవకులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు 

విజయవాడ, గుంటూరులకు కొత్త రూపు

బాబోయ్‌.. భూతాపం

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్‌ రూమ్‌లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ

అధిక ధరలకు అమ్మితే జైలుకే

రైతు భరోసాపై ప్రత్యేకంగా 9న ‘స్పందన’

సుమతి ఏజెన్సీ సర్వీసెస్‌పై గవర్నర్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌