'కొత్త మార్పులకు జీఎస్టీ నాంది'

21 Jun, 2017 14:15 IST|Sakshi
విశాఖపట్నం: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు జీఎస్టీ ఉపయోగపడుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే వ్యవస్థ జీఎస్టీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ.. రకరకాల పన్నుల విధానం వల్ల అధికారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీఎస్టీతో పన్ను ఎగవేత దారులకు చెక్‌ పెట్టొచ్చు.
 
దేశంలో రాబోయే కొత్త మార్పులకు జీఎస్టీ నాంది పలుకుతుంది. వస్తుసేవల పన్ను విధానం పై అవగాహన కల్పించాలి తప్పితే వేధింపులకు గురిచేయవద్దు. వివిధ వర్తక వ్యాపార వర్గాల ప్రతినిధులు జీఎస్టీ వల్ల తాము ఎదుర్కొనే సమస్యల పై పీయూష్ గోయల్ కు రిప్రజంటేషన్స్ అందజేశారు.
 
మరిన్ని వార్తలు