జమ్మలమడుగు వైస్చైర్మన్‌ వాహనంపై కొడవళ్లతో దాడి

7 Apr, 2015 03:13 IST|Sakshi
ముల్లా జానీ (ఫైల్ ఫొటో)

జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మునిసిపాలిటీ వైస్ చైర్మన్, టీడీపీ నేత ముల్లా జానీ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. జానీ మండల పరిధిలోని ఎస్.ఉప్పలపాడు గ్రామానికి వెళ్లి జమ్మలమడుగుకు ఫార్చ్యూనర్ వాహనంలో తిరిగి వస్తుండగా, మార్గ మధ్యంలో నలుగురు వ్యక్తులు కొడవళ్లతో ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. జానీ అంగరక్షకుడు వెంటనే  రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు.

కాగా, సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ పి.సర్కారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు