'రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం'

14 Nov, 2019 20:02 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు.ఇండియా - అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెన్నత్ జస్టర్కు భారత్ తరఫున నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గోర్మడే స్వాగతం పలికారు.

కెన్నత్ మాట్లాడుతూ..  డిసెంబర్ 18,19 తేదిలలో హైదరాబాద్ లో, ఫిబ్రవరిలో లక్నోలో రెండు దేశాల మధ్య వాణిజ్య సదస్సులు ఉన్నాయని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల‌ మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇండియా-అమెరికా భాగస్వామ్యంతో హైదరాబాద్ లో అపాచి హెలికాఫ్టర్లు, ఎఫ్ 16 యుద్ధ విమానాల విడిభాగాలు, సి1 30 విమానాల విడిభాగాల తయారీలు పురోగతిలో ఉన్నాయన్నారు.

కాగా, భారత - అమెరికా సంయుక్త విన్యాసాలు  టైగర్ ట్రంప్ 2019 ఉభయచర విన్యాసాలలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వపై ఉభయ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఈనెల 21 వరకు విశాఖ, కాకినాడలలో ఇండో-అమెరికన్‌ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విశాఖ తీరానికి అమెరికా యుద్ద నౌక జర్మన్ టౌన్ చేరుకుంది‌. ఈ సందర్భంగా ఇండియా, అమెరికా నేవీ అధికారులు యుద్ద విమానాలు, మిస్సైల్ ను ప్రదర్సించారు.

భారత - అమెరికా మిలటరీ సహకారానికి ఈ విన్యాసాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని ఇండియా, అమెరికా నేవీ అధికారులు పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య త్రివిధ దళాల‌ మధ్య మెరుగైన సంబంధాలు, మానవీయ సాయం, విపత్తుల వంటి అంశాలలో  నైపుణ్యాల అభివృద్ది , పరస్పర సహకారాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సంయుక్త విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల త్రివిధ దళాల సైనికులు పరస్పర సందర్శనలు, సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే లైవ్ ఫైర్ డ్రిల్లులు, భారత హెలీకాప్టర్లు అమెరికా నౌక జర్మన్ టౌన్ పై లాండింగ్ వంటివి రాబోయే తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా