గవర్నర్‌ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు

3 Apr, 2017 15:22 IST|Sakshi
గవర్నర్‌ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ ప్రజలపక్షాన నిలబడకుండా.. ప్రభుత్వాల భజన చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ మారిన వారితో ఓ వైపు గవర్నర్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోకుండా ఇలానే చూస్తూ కూర్చుంటే.. రానున్న రోజుల్లో ఓటు హక్కుని ఎవరు కూడా వినియోగించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతున్నా ప్రదాని మోడీ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతరపార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని పిలపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలుస్తానన్నారు.

మరిన్ని వార్తలు