‘ఇది సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయం’

10 Mar, 2020 19:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, ఏ పార్టీ కూడా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావడం సాహసోపేత నిర్ణయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి. లక్ష్మణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దశల వారి మద్య నియంత్రణను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఉన్న బెల్టు షాపులను సమూలంగా తొలగించారని వెల్లడించారు. ప్రైవేటు రంగలో ఉన్నమద్యం షాపులను ప్రభుత్వ రంగంలోకి తీసుకు వచ్చి వాటి పని గంటలను తగ్గించారని తెలిపారు. 
‘దీన్ని కూడా రాజకీయం చేయడం బాబుకే చెల్లింది’

రాత్రి ఎనిమిది గంటలు దాటితే మద్యం దొరకని పరిస్థితి సీఎం జగన్‌ కల్పించారని పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో ఏ సీఎం చెప్పని విధంగా ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రాబల్యం లేకుండా జీరో పాలిటిక్స్‌కు సీఎం జగన్‌ చేస్తున్న కృషిని తమ కమిటీ స్వాగతిస్తుందని తెలిపారు. ఏడు నెలల కృషి ఫలితంగా రాష్ట్రంలో మద్య వినియోగం 24 శాతం, బీరు వినియోగం 58 శాతం తగ్గించారన్నారు. దీనిపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో రోడ్డుప్రమాదాలు, నేరాలు, హత్యలు అనేక దుష్పరిణామాలు తగ్గాయని తెలిపారు. స్థానిక బహుఖ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం, ప్రచార సమయాన్ని తగ్గించడం ద్వారా ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గతంలో ఎన్నికల వ్యయంలో అభ్యర్థులు మూడో వంతు మద్యం పంపిణీకి కేటాయించేవారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 60 నుంచి70 కోట్లు మద్యం పంపిణీకే ఖర్చు పెట్టారని తెలపారు. రూ. 200 కోట్లు ఉప ఎన్నికలకు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు ది అన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలను డబ్బు ,మద్యం మయం చేసిన పాత్ర చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లో మద్యం, డబ్బు పాత్ర పెరిగిందన్నారు.

కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ డబ్బు,మందు పాత్ర తగ్గించాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. సేవా దృక్పతం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి అలాంటి వారిని గెలిపించుకోమని చెప్పడాన్ని తమ కమిటీ స్వాగతిస్తుందని చెప్పారు. నిఘా యాప్ ద్వారా ఎన్నికల సమమయంలో మద్యం, డబ్బుల పంపిణీ  జరిగితే వీడియో తీసి అధికారులకు పంపిస్తే.. సత్వరమే చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ మద్యం, డబ్బుతో ప్రలోభాలకు పాల్పడిన అభ్యర్థిని ఎన్నిక అయిన తరువాత గుర్దిస్తే వారి సభ్యత్వం రద్దు అవుతుంది  తెలిపారు. కాగా రాష్ట్రంలో మద్యం, డబ్బు రహిత ఎన్నికలు జరగాలని తాము కోరుతున్నామన్నారు. గతంలో డబ్బు సంచులతో మద్యం బాటిళ్లతో ఎన్నికల్లో దిగిన రాజకీయ నాయకులకు స్వస్తి పలికి సేవా బావంతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులపై పార్టీలు దృష్టి పెట్టాయన్నారు. సేవ చేసే నాయకులను ఎన్నుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర ముఖచిత్రం మారుతుందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు