జూన్‌ నాటికి వంశ'ధార'

17 Nov, 2019 05:47 IST|Sakshi

ప్రాజెక్టు రెండో దశను ప్రాధాన్యతగా గుర్తించిన సర్కార్‌

అదే జాబితాలో వంశధార–నాగావళి అనుసంధానం పనులు 

జూన్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

రూ.463.29 కోట్లను మంజూరు చేయాలని ఆర్థిక శాఖకు నిర్దేశం

సిక్కోలుకు వరమంటున్న సాగునీటి రంగ నిపుణులు

సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్‌ నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనికి అవసరమైన రూ.463.29 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేసి వంశధార జలాలను కొత్తగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు అందించడంతోపాటు 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి మార్గం సుగమం చేయాలని నిర్ణయించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యతనిస్తోంది. 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో ప్రారంభమై..  
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. వంశధార ప్రాజెక్టు రెండో దశ డిజైన్‌లో మార్పులు చేసి 2004లో చేపట్టారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్‌ వియర్‌(మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని  తరలించి 0.069 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలు నిల్వ చేసుకునేలా పారాపురం వద్ద మరొకటి.. హీరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో మరొక రిజర్వాయర్‌ను నిర్మించే పనులను చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయడంలో 2009– 2019 మధ్య ఉన్న ప్రభుత్వాలు విఫలమయ్యాయి. 

జూన్‌లోనే నారాయణపురం ఆయకట్టుకు నీళ్లు.. 
నాగావళిలో జూలై ఆఖరు నాటికిగానీ వరద ప్రారంభం కాదు. దీని వల్ల నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట కింద 37 వేల ఎకరాల్లో సకాలంలో ఖరీఫ్‌ పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. ఈ దుస్థితిని తప్పించేందుకు హీరమండలం రిజర్వాయర్‌ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల వంశధార జలాలు 33.24 కిమీల పొడువున తవ్వే హైలెవల్‌ కెనాల్‌ ద్వారా నారాయణపురం జలాశయంలోకి తరలిస్తారు. తద్వారా వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేసే పనులనూ జూన్‌ నాటికి పూర్తిచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ హైలెవల్‌ కెనాల్‌ కింద కొత్తగా 15 వేల ఎకరాల ఆయకట్టుకు, నారాయణపురం ఆయకట్టుకూ ఖరీఫ్‌లో సకాలంలో నాట్లుపడేలా నీళ్లివ్వాలని నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వల్ల కొత్త, పాత కలిపి 3.07 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శరవేగంగా పూర్తిచేయాలని... 
వంశధార ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టాలని ఈనెల 13న నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ పనుల్లో మిగిలిన వాటిని వరద ప్రారంభమయ్యేలోగానూ,  సింగిడి బ్యారేజీ పనులను జూన్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హీరమండలం రిజర్వాయర్‌ స్పిల్‌ వే, రివిట్‌మెంట్‌ పనులు పూర్తి చేయడం ద్వారా 19.05 టీఎంసీలు నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జూన్‌లోనే జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

4 నిమిషాలకో నిండు ప్రాణం బలి!

వైఎస్సార్‌ కాపు నేస్తం

ఆంగ్ల మీడియానికి జనామోదం

ఇసుకాసురులే రోడ్డెక్కారు..

ఏపీ సమస్యల ప్రస్తావనకు సమయమివ్వండి 

మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్‌ కుట్ర

చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది

నకిలీలకు చెక్‌.. కల్తీకి కళ్లెం

డిసెంబర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

త్వరలో పట్టాదారు కార్డులు

ఉల్లి.. వంటింట్లో లొల్లి

ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులిచ్చిన మీరా మాట్లాడేది?

క్షుద్రపూజలు చేయించానా? 

పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్‌

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ గొగోయ్‌ దంపతులు

గోవా డీజీపీ మరణం నన్ను కలచివేసింది

తగిన సమయం కేటాయించాలని కోరాం: మిథున్‌ రెడ్డి

‘పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదు’

సినిమాను తలపించే బిల్డప్‌.. సొమ్ము స్వాహా!

స్పందనపై నమ్మకాన్ని పెంచండి 

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి

ఎమ్మెల్యే ఆర్కే వినూత్న ఆలోచన

చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌ 

పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ

దేవినేని అవినాష్‌కు ముందే చెప్పా: మంత్రి కొడాలి నాని

ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం

ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్

ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్‌ వన్‌’

అందరికీ అందుబాటులో ఇసుక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిర్మాతే నా హీరో

కొత్త కాంబినేషన్‌ గురూ

నాటకమే జీవితం

ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

డిసెంబరులో సందడి?

మా జాగ్రత్తలు ఫలించలేదు