నేటి నుంచి వన మహోత్సవాలు

31 Aug, 2019 04:20 IST|Sakshi

గుంటూరు జిల్లా డోకిపర్రులో మొక్కలు నాటి ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి నెల రోజులపాటు వన మహోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను కూడా ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు మంత్రులు పాల్గొంటారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించినట్టు ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ దళాల అధిపతి మహమ్మద్‌ ఇలాయాస్‌ రిజ్వీ తెలిపారు. 

మరిన్ని వార్తలు