‘వనం–మనం’లో అపశ్రుతి

29 Jul, 2016 16:13 IST|Sakshi
‘వనం–మనం’లో అపశ్రుతి
మెుక్కలు నాటుతుండగా  నర్సుకు పాము కాటు
ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం–మనం కార్యక్రమంలో శుక్రవారం అపశ్రుతి చోటుచేసుకుంది. చెట్లు నాటుతున్న నర్సు పాము కాటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మండలంలోని ఈతముక్కలలో జరిగింది.

ఈతముక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటేందుకు అక్కడి వైద్యాధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు. స్టాఫ్‌ నరుస్సు సీహెచ్‌ ప్రమీల మొక్కలు నాటేందుకు పాదులు తీస్తుండగా గుమ్మడిత్తుల పాము చేతిపై కాటేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి 48 గంటలు ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీలను ఆమె పరామర్శించారు. 
 
మరిన్ని వార్తలు