ఆదాయం.. హారతి

7 Jul, 2018 09:54 IST|Sakshi
అనధికారంగా ఆశీర్వాదం అందజేస్తున్న అర్చకులు

వరసిద్ధుని రాబడి.. నెలకు రూ.50 లక్షలు పక్కదారి

అధికారులకు నెలవారీ మామూళ్లు

కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు దేవస్థానం సిబ్బంది హారతి పళ్లెం రూపంలో స్వాహా చేస్తున్నారు. దేవస్థానం ఈఓ ఈ విషయంపై దృష్టి సారిస్తే నెలకు రూ.50 లక్షల మేరకు ఖజానాకు చేరుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. 

కానుకలు ఎవరికి చేరాలి?
నిత్యం దేశం నలుమూల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు వరసిద్ధి వినాయకస్వామివారిని  దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. ఈ క్ర మంలో వారు స్వామివారికి చేరేలా కానుకలు స మర్పిస్తారు. పేద, ధనిక, పిల్లల పేరుతో మొక్కుబడులు ఇచ్చేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సగటున భక్తులు రూ.పది నుంచి రూ.10 వేల నూట పదహార్ల వరకు సమర్పించి మొక్కులు తీ ర్చుకునేవారుంటారు. వీటితో పాటు వెండి, బం గారం (తులం, అర తులం) సమర్పించే వారు దక్షిణాది రాష్ట్రాల్లో భక్తులు ఎక్కువగా ఉన్నారు. వీరిని గర్భాలయ సిబ్బంది తప్పుదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారి గర్భాలయంలో మూల విగ్రహనికి ఎదురుగా హారతి పళ్లెం ఉంచి కానుకలు అందులో పడేలా భక్తులను ప్రసన్నం చేసుకుంటారు. దీంతో ఆ మొత్తం వారి జేబుల్లోకి వెళుతోంది. ఇలా సాధారణ సమయాల్లో రోజుకు రూ.20 వేలు, రద్దీ సమయాల్లో రూ. 50 వేల పైచిలుకుకు నొక్కేస్తున్నారు. ఈ క్రమంలో నెలకు రూ.50 లక్షలకు పైగా స్వాహా జరుగుతోంది.

ఆశీర్వాదాలతో నిలువు దోపిడీ
వినాయకస్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఉండే అర్చక, వేదపండితుల వద్ద ఆశీర్వాదం పొందాలని భావి స్తారు. అలాంటి వారి కోసం దేవస్థానంలో ఆశీర్వా ద సేవ ఉంది. అయితే ఆలయంలో పనిచేసే అర్చ క, వేదపండితులు ఎలాంటి టికెట్‌ లేకుండా కేవలం ధనిక భక్తులకు ఉచితంగా ఆశీర్వాదం చేసి, కండువాలు కప్పుతారు. ఇందుకు భక్తులు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అర్చకులు, వేదపండితుల చేతిలో ఉంచి, వెళుతున్నారు. ఇలా కూడా దేవస్థానానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోంది.

ఈఓ దృష్టి సారించాలి  
కాణిపాక దేవస్థానికి వచ్చే భక్తులు అందజేసే కానుకలు ఆలయంలో పనిచేసే సిబ్బందే స్వాహా చేస్తుండడం వెనుక భక్తుల నుంచి పలురకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానుకలు స్వాహా జరిగే ప్రాంతాలపై దేవస్థాన ఈఓ దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా గర్భాలయంలో హారతి పళ్లెం, అభిషేక అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసే కేంద్రం, వేదపండితులు, అర్చకుల అనధికార ఆ శీర్వాదాలు, హోమం జరిగే, గణపతి చతుర్థి వ్ర తం, దేవస్థానంలో పనిచేసే సిబ్బంది పని తీరుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

భక్తులు కానుకలు హుండీలోనే సమర్పించాలి
భక్తులు కానుకలను హుండీలోనే సమర్పించాలి. ఎలాంటి కానుకలు హారతి పళ్లెం లో వేయకూడదు. ఈ క్రమంలో దేవస్థానంలో విధులు నిర్వహించే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశాం. అలాగే ఆశీర్వా దం టికెట్టు లేకుండా ఆశీర్వాదాలు చేస్తే అలాంటి సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.     –పి.పూర్ణచంద్రరావు,కాణిపాకం దేవస్థానం ఈ

>
మరిన్ని వార్తలు