వర్గాల ప్రభ

2 Mar, 2014 04:06 IST|Sakshi

 అవకాశమేదైనా అందులో తమ ‘పట్టు’ ఎంతో చూపాలన్నది జిల్లా కాంగ్రెస్ పెద్దల తపన. ఇందుకు వర్గాల కుంపట్లను ఆనవాయితీగా రాజేస్తూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటుంటారు.

తాజాగా ‘తెలంగాణ’ క్రెడిట్ ముసుగులో ‘కృతజ్ఞతా సభల’కు ఉపక్రమిస్తున్నారు. ఈ వేదికగా ఎవరి బలం ఎంతో ప్రదర్శించాలన్నది ఎత్తుగడ. ఇందుకు అనుగుణంగా తమవారిని కదిలిస్తూ పావులు జరుపుతున్నారు. ఎన్నికల వేళ ఎవరి సత్తా ఏమిటో అధిష్టానానికి తెలిపేందుకు సిద్దపడుతున్నారు.
 

 మహబూబ్‌నగర్:

 తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ దక్కించుకోవడంతో పాటు, సొంత పార్టీలోని ఎదుటి వర్గంపై పైచేయి సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు. పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఓ వర్గం జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి హడావుడి చేసింది.

ఎదుటి వర్గం ఎత్తులను పసిగట్టిన మరోవర్గం ‘కృతజ్ఞత సభ’ల పేరిట పై ఎత్తులు వేస్తుండటంతో కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

మరిన్ని వార్తలు