'ఆయ‌న త‌ప్పించుకున్నా.. న్యాయం జ‌రుగుతుంది'

24 Jun, 2020 17:16 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ‌ : మ‌హిళా క‌మిష‌న్‌కు ప్ర‌భుత్వం వెన్నుద‌న్నుగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ ఇచ్చిన‌ట్లు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశాలు బుధ‌వారం ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు జరగడంపై సీఎం దృష్టికి తీసుకొచ్చామ‌న్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ విద్యార్థులకు నిరంతర కౌన్సిలింగ్ అవసరమని ముఖ్య‌మంత్రికి  చెప్పిన‌ట్లు తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించార‌ని, ఈ ప్రభుత్వం మహిళలకు భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్య‌మంత్రి తెలిపిన‌ట్లు వాసిరెడ్డి ప‌ద్మ పేర్కొన్నారు.(యూజీ, పీజీ పరీక్షలపై మంత్రి సురేష్‌ స్పష్టత )

చిన్నపిల్లలు, మైనర్ బాలికలపై అఘాయిత్యం, అత్యాచార ప్ర‌యత్నాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. సచివాలయాల్లో ఈ అంశంపై కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పిన‌ట్లు తెలిపారు. మహిళా సంక్షమానికి స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకునే రీతిలో ప్రయత్నం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని ప్ర‌శంసించారు. మహిళల సాధికారతకు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం సూచించిన‌ట్లు వాసిరెడ్డి ప‌ద్మ తెలిపారు. (తెలుగు ప్రజలకు ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త)

అయ్యన్నపాత్రుడు ఓ మహిళా ఉద్యోగిని దూషించిన సంఘటన అందరినీ అభద్రతకి గురి చేసిందన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పించుకున్నప్ప‌టికీ న్యాయం మాత్రం జరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశంలో నిర్భయ వంటి తీవ్రమైన చట్టం పెట్టినప్పుడు, చర్యలు ఉండవా అని మహిళా లోకం ప్రశ్నిస్తోందన్నారు. మహిళలను కించపరిచి మాట్లాడే వాళ్ళు భయపడే విధంగా చర్యలు కఠినంగా ఉండాలని వాసిరెడ్డి ప‌ద్మ డిమాండ్ చేశారు. (గుడ్‌న్యూస్‌: మరింత పెరిగిన రికవరీ రేటు)

మరిన్ని వార్తలు