‘దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు’

29 Jun, 2020 12:51 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకు వచ్చిన దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్‌ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇలా జరగటం దారుణమన్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు పట్టణంలో శనివారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ వీడియోలు చిత్రీకరించిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఈక్రమంలో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!)

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు ఏఐపీ అడ్రస్‌ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుని తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు