నేటి నుంచి పండ్లు, కూరగాయల రైతులకు ఫీజులు రద్దు

10 Jul, 2019 05:12 IST|Sakshi

మార్కెట్‌ యార్డులు, చెక్‌పోస్టుల్లో అమలు

22 మార్కెట్లలో కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం

సాక్షి, అమరావతి బ్యూరో: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్‌ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్‌లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్‌ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మార్కెట్‌ యార్డుల్లో ఉన్న కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం పలికారు.

ఇప్పటి వరకూ కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌ యార్డుల్లో 4 నుంచి 10 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దుతో రైతులకు ఊరట లభించనుంది. కమీషన్‌ ఏజెంట్లు వ్యాపారం చేయాలంటే ట్రేడర్స్‌గా మారాల్సి ఉంటుంది. వీరు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. దీంతో ఔత్సాహికులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా మదనపల్లి, ఏలూరు, తెనాలి, బంగారుపాలెం, పుంగనూరు, రావులపాలెం వంటి మార్కెట్‌లలో అమలు కానుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా.. రైతులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

గురుభ్యోనమః

ఉపాధ్యాయుడి పైశాచికత్వం

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

డ్రైఫ్రూట్‌ కిళ్లీ@ చీరాల

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

సింహగిరి.. భక్తఝరి

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు

టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..

ఎవరైనా బీజేపీలో చేరొచ్చు

ఆహాఏమిరుచి..అనరామైమరచి

గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్‌..!

కర్కశత్వానికి చిన్నారుల బలి

జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

విశాఖలో టీడీపీ పంచాయితీ

తిన్నది.. కరిగిద్దామిలా..!

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా