‘శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు’

19 Aug, 2019 18:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానం ముందు దుకాణాల వేలం రద్దు చేయాలని దేవదాయ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు వేలం జరగగా ఈ వేలంలో దుకాణాదారులు, పాటదారులకు మధ్య వివాదం తలెత్తింది. కాగా ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతిని ఉపేక్షించే ప్రశ్నేలేదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని  వెల్లడించారు.

దీనిపై సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని చెప్పారు

శ్రీశైలం ఈవో బదిలీ..
ఇదిలా ఉండగా  శ్రీశైలం ఆలయ ఈవోను బదిలీ చేస్తూ తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  నూతన ఈవోగా కెఎస్ రామారావు నియమితులయ్యారు. ఈవో శ్రీరామచంద్ర మూర్తి ని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు