మంత్రి వెల్లంపల్లికి మాతృ వియోగం

25 Aug, 2019 18:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన  తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మమ్మ ఇవాళ సాయంత్రం మరణించారు. కుటుంబసభ్యులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మంత్రి వెల్లంపల్లి మాతృమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. వెల్లంపల్లి కుటుంసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహాలక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మరోవైపు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, మేరుగ నాగార్జున తదితరులు మంత్రి వెల్లంపల్లిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.


మంత్రి వెల్లంపల్లి తల్లి మహాలక్ష్మమ్మ పార్ధీవ దేహానికి వైఎస్సార్‌ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి నివాళులు అర్పించారు. వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాసరావును  ఫోన్లో పరామర్శించారు. మహాలక్ష్మమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు