బెజవాడ గ్యాంగ్‌ వార్‌పై మంత్రి సీరియస్‌

31 May, 2020 21:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న శ్రీనివాస్ నగర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో విజయవాడలో రౌడీ పాలన సాగిందని మంత్రి మండిపడ్డారు. ఇకపై నగరంలో వారి ఆటలు సాగవన్నారు. పటమటలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన తోట సందీప్‌, జనసేనకు చెందిన పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. (బెజవాడ గ్యాంగ్‌ వార్‌లో కొత్త ట్విస్ట్)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా