సాగును బాగు చేద్దాం

16 Nov, 2017 02:31 IST|Sakshi
అగ్రి హ్యాకథాన్‌ సదస్సులో మత్స్య శాఖ ఏర్పాటుచేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిచ్చి ఆదుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చకుంటే రైతులు సాగును విడిచిపెట్టి మరో వృత్తిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు నిల్వ చేసుకోవడానికి, మార్కెట్‌కు తరలించుకోవడానికి రైతులకు కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే అగ్రి హ్యాకథాన్‌ (ఏపీ అగ్రిటెక్‌–2017)ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

దేశంలో ఇప్పటికీ 60 శాతానికి పైగా గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఆహార భద్రతకు వ్యవసాయం అవసరమని చెప్పారు. దేశంలో తొలిసారిగా విశాఖలో అగ్రి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితిని వివరించారు.

మరిన్ని వార్తలు