విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి: ఉప రాష్ట్రపతి

8 Feb, 2020 17:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ప్రొఫెసర్‌ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. విశాఖ గీతం విశ్వ విద్యాలయంలో శనివారం ‘ఏ చైల్డ్‌ ఆఫ్‌ డెస్టినీ ఆన్‌ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతంలో ఏడాదిన్నరకాలం పాటు ఉంటూ జీవితంలో ఏ విధంగా అడుగులు వేయాలో నేర్చుకున్నానని తెలిపారు.


మహత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు నేటి తరానికి అందిస్తున్న వ్యక్తిగా రామకృష్ణ నిలిచారని, అందుకే ఆయన అంటే చాలా ఇష్టమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సమాజంలో మానవ ప్రమాణాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని, వనరులు పుష్కలంగా ఉన్న దేశం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జీడీపీలో 5వ స్థానంలో ఇండియా ఉందని, భారత విద్యా వ్యవస్థలో మార్పు రావాలని భావించారు. భారతీయ పౌరులకు ఎవరిపై వివక్షత లేదని, భారతదేశం ఎవరిపైన దండయాత్ర చేయలేదని ప్రస్తావించారు. అదే విధంగా సీఏఏపై ప్రజలు అధ్యాయనం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు