ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్‌

19 Jul, 2018 13:56 IST|Sakshi
ధర్నా చేపట్టిన విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు

సాక్షి, విజయవాడ : పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయటాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తున్నాయి. గురువారం విజయవాడ రామవరప్పాడు రింగ్‌ వద్ద వీహెచ్‌పీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, హిందుత్వ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు వరకు వారు ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రామవరప్పాడుకు ర్యాలీగా వస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. 

కరీంనగర్‌ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ.. గురువారం విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌లు నగర దిగ్భందం చేశాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. 

పెద్దపల్లి : తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ విశ్వసిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను వారు తప్పు పట్టారు. గురువారం గోదావరిఖనిలో రాజీవ్‌ రహదారిపై వీహెచ్‌పీ రాస్తారోకో చేపట్టింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు. 

హైదరాబాద్‌ : పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆయనపై ఉన్న బహిష్కరణను రద్దు చేయాలంటూ వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు కూకట్‌పల్లి జాతీయ రహదారిపై బైఠాయించారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా