అలా రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్య నాయుడు

28 Aug, 2019 18:24 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎన్‌ఎస్‌టీఎల్‌ అర్ధ శాతాబ్ధి వేడుకలో పాల్గోనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భం‍గా మాట్లాడుతూ... డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ ఎన్నో పరిశోధనలకి కిలకంగా వ్యవహించిందని, చంద్రయాన్‌ ప్రయోగంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ పాత్ర ఉండటం అభినందనీయం అంటూ ప్రశంసించారు. సెప్టెంబర్‌లో చంద్రుడిపై అడుగుపెట్టబోతుండటం మనకి గర్వకారణం అన్నారు. దేశ ప్రశాంతతకు, రక్షణకు ఎన్‌ఎస్‌టీఎల్‌ పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కితాబిచ్చారు. మన దేశంలో తయారయ్యే రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసేలా మన పరిశోధనలు ఉండాలని శాస్త్రవేత్తలకు సూచించారు. అలాగే ఎన్‌ఎస్‌టీఎల్‌ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ముఖ్యమైన తూర్పునావికా దళానికి ఎన్‌ఎస్‌టీఎల్‌ వెన్నుముకగా ఉందని, విశాఖలో ఒకేసారి ప్రారంభమైన తూర్పు నావికా దళం, ఎన్ఎస్‌టీఎల్‌లు దేశ రక్షణ రంగంలోఅత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.

తాను ఏయూలోనే చదువుకున్నానని, ఎమర్జెన్సీ రోజులలో ఇక్కడే ఉన్నానని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో 17 నెలల పాటు  జైలు జీవితం గడిపానని, అదే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని చెప్పారు. కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం.. ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మన దేశం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని అలాగే మన దేశంపై దాడులు చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పామన్నారు. 

ఈ ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు రాష్ట్ర పర్యాటక శాఖ, సంస్కతిక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, తూర్పు నావికాదళం వైఎస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌, డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నందగోపన్‌తో పాటు, జిల్లా కలేక్టర్‌ ఉన్నతాదికారులు ఘన స్వాగతం పలికారు. (ఇది చదవండి: ఆనాడు చాలా బాధపడ్డానన్న వెంకయ్య)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా