సీఎం జగన్‌ను చూసి నేర్చుకోండి

21 Jan, 2020 15:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకంతో రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని, ఈ పథకం రాష్ట్ర చరిత్రను మార్చేయబోతోందని ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మ ఒడి పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో చదువుల విప్లవం వచ్చిందని వ్యాఖ్యానించారు. విద్య వల్లే మనిషికి గుర్తింపు వస్తుందని మహాత్మ గాంధీ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అమ్మఒడి నూతన ఒరవడి అని, ఈ పథకంతో పేద కుటుంబాల రూపురేఖలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నిమ్నవర్గాలు సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అమ్మఒడి పథకం దోహదం చేస్తుందన్నారు.

టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పాలకుడు అంటే ఎలా ఉండాలి, పాలన అంటే ఉండాలో సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. విద్యార్థులను నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని కితాబిచ్చారు. యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త శకం ప్రారంభం కాబోతోందని ఎమ్మెల్యే విడదల రజనీ ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి:

‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’

హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్‌

టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా

యనమలకు మంత్రి బొత్స సవాల్‌

‘సీఎం జగన్‌కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు’

మరిన్ని వార్తలు