విశాఖకు త్వరలో పూర్వ వైభవం

30 Oct, 2014 02:16 IST|Sakshi
విశాఖకు త్వరలో పూర్వ వైభవం
 • ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
 •  సహాయ చర్యలపై బాధితులతో సీఎం ముఖాముఖి
 • సాక్షి, విశాఖపట్నం: ‘హుదూద్ విధ్వంసానికి కకావికలమైన విశాఖ మహా నగర వాసులకు దేశం యావత్తు అండగా నిలిచింది.. అందువల్లే కేవలం మూడు రోజుల్లో సాధారణ పరిస్థితుల్లోకి రాగలిగాం.. ఆత్మవిశ్వాసంతో ముందు కు సాగండి.. కచ్చితంగా త్వరలోనే విశాఖకు పూర్వవైభవం తీసుకురావచ్చ’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సహాయ చర్యల అమలుపై బుధవారం హైదరాబాద్ నుంచి తుపాను ప్రభావిత జిల్లాల ప్రజలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

  ఇందుకోసం విశాఖ శివాజీపార్కు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లా కోస్తా గ్రామాల్లో స్క్రీన్‌లు ఏర్పాటు చేయగా, స్థానిక ప్రజలు చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘హుదూద్ కనివినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది.. 45 వేల విద్యుత్ స్తంభాలు, లక్షలాది చెట్లు నేలకొరిగాయి.. విద్యుత్‌తో పాటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోయింది.. మంచినీళ్లు లేక అల్లాడిపోయారు.. ప్రజలందరి సహకారంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేశాం. మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకొచ్చాం’ అన్నారు.
   
  టపాసులు కాల్చకుండా దీపాలతో దీపావళి చేసుకుని ఐక్యతను చాటారన్నారు. ఇప్పటికే 90 శాతం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి, మిగిలిన పదిశాతం గురువారంతో పూర్తికానున్నాయన్నారు. నష్టపోయిన ప్రతీ బాధితుడిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ పూర్తయిందని, రెండు రోజుల్లో జాబితాలను ప్రకటిస్తామని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. పతీ ఒక్కరికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
   
  అంతా కార్యక ర్తలే...


  విశాఖ శివాజీ పార్కులో సీఎంతో ముఖాముఖి కార్యక్రమం జనం లేక వెలవెలబోయింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ 6.30 గంటలకు ప్రారం భం కావాల్సి ఉండడంతో చుట్టుపక్కలవారిని రావాల్సిందిగా దేశం నేతలు ఎంతగా ప్రాధేయపడినా ప్రజలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. గట్టిగా 50 మంది కూడా కన్పించలేదు. పాల్గొన్న వారిలో సాయంత్రం  పార్కుకు వచ్చే వారితో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్కు లో పనిచేసే కార్మికులు, వివిధ శాఖల అధికారులే కనిపించారు.

  సీఎంతో మాట్లాడిన వారి లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా పార్టీ నాయకులు, కార్యకర్తలే. తాము ఫలానా వార్డు టీడీపీ అధ్యక్షులం.. కార్యకర్తలం అంటూ పరిచ యం చేసుకుని మరీ బాబును పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ వచ్చిన కొద్దిమంది ప్రజ లు విస్తుపోయారు. అధికారులు కూడా ప్రజల కంటే కార్యకర్తలకే మైకు ఇచ్చేందుకు ప్రాధాన్యమిచ్చారు. మీకు నిత్యావసరాలన్నీ అందా యా? పునర్నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని అడగ్గా .. అందాయని కార్యకర్తలం తా చప్పట్లు కొట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు.  
   

మరిన్ని వార్తలు