నిల్వ ఉంచిన మాంసం స్వాధీనం

19 Jan, 2019 13:46 IST|Sakshi
నిల్వ ఉన్న ఆహారపదార్థాలు

రెస్టారెంట్లలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ

అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లకు నోటీసులు

కృష్ణాజిల్లా, తిరువూరు: పట్టణంలో పరిశుభ్రత పాటించకుండా, కల్తీ ఆహారపదార్థాలు సరఫరా చేస్తున్న పలు హోటళ్ళు, రెస్టారెంట్లపై ఆహార, కల్తీ నిరోధక అధికారులు, విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.  నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మరిల్లు, హిమశ్రీ, విజయలక్ష్మి, శ్రీనివాసా రెస్టారెంట్లను తనిఖీ చేసిన అధికారులు వాటికి కనీసం లైసెన్సులు కూడా లేనట్లు గుర్తించారు. హోటళ్ళ వంటగదులు అధ్వానంగా ఉండటం, తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం, రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసం విక్రయించడంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచంద్రరావు, విజిలెన్స్‌ సీఐ వెంకటేశ్వరరావు, డివిజనల్‌ అధికారి రమేష్‌బాబులు వేర్వేరుగా హోటళ్ళను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, హోటళ్ళు సరఫరా చేసే ఆహారపదార్థాలు కల్తీ చేస్తున్నారని గుర్తించి నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లోగా పరిస్థితులు చక్కదిద్దుకోకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచంద్రరావు తెలిపారు.

మరిన్ని వార్తలు