జాతీయ రహదారిపై విజిలెన్స్‌ తనిఖీలు

8 Dec, 2018 13:10 IST|Sakshi
వాహనాల పత్రాలను పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి

15 లారీలకు జరిమానా విధింపు  

నెల్లూరు(క్రైమ్‌): జాతీయ రహదారిపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుం డా, అధికలోడుతో వెళుతున్న లారీలు, టిప్పర్లకు జరిమానా విధించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ శ్రీకంఠనా«థ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, పీవీ నారాయణ, డీసీటీఓ రవికుమార్, విష్ణు, ఎంవీఐలు శ్రీనివాసరావు, సుధాకర్‌రెడ్డి, పూర్ణచంద్రరావు, ఏజీ ఆనంద్, బాలరాజు, సిబ్బంది మూడుబృందాలుగా విడిపోయారు.

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వెంకటాచలం టోల్‌ప్లాజా, నాయుడుపేట జంక్షన్, కావలి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా వెళుతున్న మూడు గ్రానైట్‌ లారీలు, ఏడు మెటల్‌ లారీలు, రెండు బొగ్గు లారీలు, అధికలోడుతో వెళుతున్న క్వార్ట్జ్, ఇటుక, లారీలను నిలిపివేశా రు. ఓవర్‌లోడ్‌ వాహనాల నుంచి  రూ 8,48,020, మైనింగ్‌ బిల్లులేని వాటి నుంచి రూ.35,930, అగ్రి కల్చర్‌ మార్కెటింగ్‌ రుసుము కట్టని వాహనాల నుంచి రూ.3,14,425 జరిమానా వసూలు చేశా రు. తనిఖీలు నిత్యం జరుగుతూ ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు