పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ

4 Aug, 2015 18:03 IST|Sakshi

గొల్లప్రోలు : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పత్తి కొనుగోలు కేంద్రంలో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నలుగురు అధికారులతో కూడిన బృందం మంగళవారం గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో పలువురు రైతులను విచారిస్తోంది. రైతుల పేర్లతో వ్యాపారులే సీసీఐకి పత్తిని విక్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాటిపత్తి గ్రామంలోని రైతుల నుంచి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రెండు నుంచి మూడు రోజుల పాటు విచారణ ఉంటుందని, రైతులు సహకరించాలని కోరారు. విచారణ అనంతరం ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయన్నది తెలుస్తుందని అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు