అక్రమార్కులపై చర్యకు విజిలెన్స్ సిఫార్సు

29 Jan, 2014 02:07 IST|Sakshi

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: భవన నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 34 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖరాశారు.
 
 పొద్దుటూరు మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండపాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలతోపాటు మొత్తం 48 భవనాల నిర్మాణాలకు సంబంధించి అధికారులు నిబంధనలు పాటించలేదని వారు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి 2011 జూలై 18, 19, 20, 25 తేదీలలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వయంగా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయా అధికారులతో స్వయంగా అభిప్రాయాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.పెన్నానది ఒడ్డున నిర్మించిన రెడ్ల కళ్యాణ మండపం, కేఎస్‌ఆర్ అండ్ సీఆర్‌సీ కళ్యాణ మండపం, కొవ్వూరు కళ్యాణ మండపాలు పూర్తిగా ఏటిపోరంబోకులో నిర్మించినవని తేల్చారు.
 
 పస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి బి.శివగురుమూర్తి, పులివెందుల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీజర్ ఎస్.మహబూబ్‌బాషా, కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సీటీ కృష్ణ సింగ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ డి.గోపాలకృష్ణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, రిటైర్డు మున్సిపల్ కమిషనర్ జీ.వెంకట్రావు, ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీ కృష్ణ ప్రసాద్, పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పీ.సాంబశివారెడ్డి, చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి టీ.ఆమోష్, దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్, నంగనూరుపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.రవి, గతంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న డీ.ధనుంజయబాబు, ఎర్రగుంట్ల మండలంలోని చిన్నదండ్లూరు గ్రామ కార్యదర్శి ఎం.విజయలక్ష్మిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 అలాగే అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల తహశీల్దార్ ఎం.మనోహర్, జమ్మలమడుగు తహశీల్దార్ కే.వీ.శివరామయ్య, చక్రాయపేట తహశీల్దార్ ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎర్రగుంట్ల ఏఆర్‌ఐ బి.లక్ష్మిదేవి, గతంలో ఎర్రగుంట్ల తహశీల్దార్‌గా పనిచేసిన టీ.అంజనాదేవి, రిటైర్డు తహశీల్దార్‌లు ఎస్.నాగమల్లన్న, టీవీ సత్యకుమార్, ఎం.వెంకోబరావు, పీ.శ్రీనివాసులు, టీ.జయచంద్ర, ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.ప్రకాష్, రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న జీ.వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.శాంతన్ సుధాకర్, సిద్ధవటం తహశీల్దార్ వైఎస్ సత్యానందం, రాయచోటి తహశీల్దార్ జీ.చిన్నయ్య, జమ్మలమడుగు డిప్యూటీ తహశీల్దార్ పుష్పాంజలి, రిటైర్డు సీనియర్ అసిస్టెంట్ వీ.రవీంద్రబాబు, రిటైర్డు డిప్యూటీ తహశీల్దార్ సీ.కృష్ణమూర్తి, రిటైర్డు వీఆర్‌ఓ ఏ.మహ్మద్‌ఖాసీంతోపాటు ఎర్రగుంట్ల వీఆర్‌ఓ ఓబయ్య, ఎంఆర్‌ఐ పీఎంవీ మనోజ్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
 
 పెన్నానది ఒడ్డున ఏటి పోరంబోకులో నిర్మించిన కళ్యాణ మండపాలకు సంబంధించి వీరిపై పూర్తిగా నివేదిక పంపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని, బిల్డర్లకు భారీ ఎత్తున జరిమానా విధించాలని సూచించారు.
 
 ఈరు గుర్తించిన నిర్మాణాల్లో ఎంవీఎస్ రెసిడెన్సి, జీ రామచంద్రుడు కమర్షియల్ బిల్డింగ్, సత్యనారాయణ ప్యారడైజ్, సరోవర్ రెసిడెన్సి, ఆదిత్య ఎన్‌క్లేవ్, రాజా రెసిడెన్సి, పద్మలక్ష్మి ఎన్‌క్లేవ్, వీఎన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు, శివబాలాజీ రె సిడెన్సి, శ్రీకృష్ణ ఆర్కేడ్, శ్రీరామ అపార్ట్‌మెంట్, రాజా రెసిడెన్సి, రాఘవేంద్ర రెసిడెన్సి, ఎస్‌ఎస్ రెసిడెన్సి, తల్లం సాయి రెసిడెన్సి, గోకుల్ రెసిడెన్సి, లక్ష్మిటవర్స్, రిషి రిసిడెన్సి, చరణ్‌తేజ్ రెసిడెన్సి, శ్రీబాలాజీ హాస్పిటల్స్, భారత్ ఎన్‌క్లేవ్, శ్రీనివాస, గౌతమి, సీబీఐటీ విద్యా సంస్థలతోపాటు పెన్నానది వద్ద నిర్మించిన మూడు కళ్యాణమండపాలు ఉన్నాయి.     
 

మరిన్ని వార్తలు