అటల్ భూజల్ పథకంలో ఏపీ లేదు

2 Mar, 2020 17:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అటల్‌ భూజల్‌ యోజన పథకం కింద ఎంపిక చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేదని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణ కోసం రూ. 6 వేల కోట్ల ఖర్చుతో ప్రతిపాదించిన అటల్‌ భూజల్‌ యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఈ పథకానికి  రూ. 6 వేల కోట్లలో సగం వాటాను ప్రపంచ బ్యాంక్‌ ఆర్థిక సాయంగా అందిస్తుందని తెలిపారు. మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాగా.. 2020-21 నుంచి 2024-25 వరకు ఈ పథకం కొనసాగుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ 7 రాష్ట్రాలలోని 78 జిల్లాల్లోని 8353 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. భూగర్భ జలాల పరిస్థితి ఆందోళకరంగా ఉండి ఈ పథకం అమలు చేయడానికి ముందుకు వచ్చిన రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత భాగస్వామ్య రాష్ట్రాల ఎంపిక జరిగినట్లు మంత్రి కటారియా వెల్లడించారు. (బయటకొచ్చి మాట్లాడు చిట్టీ: విజయసాయి రెడ్డి)

మరిన్ని వార్తలు