‘సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోకి’

4 Dec, 2019 19:33 IST|Sakshi

ఢిల్లీ: సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని వైఎస్సార్‌ కాంగెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం ఆయన రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం ఈ చట్టం ఉద్దేశమని ఆయన చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారు తరచుగా దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారని గుర్తుచేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే.. వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంచార, విముక్త జాతులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోవిడ్‌ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు

రెవెన్యూ లోటును కేంద్రమే పూడ్చాలి

వైఎస్సార్‌ నిర్మాణ్, ఏపీ ఇండస్ట్రీస్‌ కోవిడ్‌–19 రెస్పాన్స్‌ పోర్టల్స్‌ ప్రారంభం

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

వాస్తవిక దృక్పథంతో నూతన పారిశ్రామిక విధానం

సినిమా

డ్రైవర్‌ పుష్పరాజ్‌

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు