మరో విప్లవాత్మక పథకం: విజయసాయిరెడ్డి

10 Oct, 2019 12:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ మరో విప్లవాత్మకమైన పథకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  అన్ని వర్గాల ప్రజల్లో దృష్టిలోపం నివారించే దిశగా బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. రెండు విడతల్లో 70 లక్షల మంది విద్యార్థులకు వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

కాగా, అనంతపురం జిల్లాలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రారంభించారు. వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.  తొలి దశలో ఈనెల 10 నుంచి 16 వరకు విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మలి దశలో దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.   

>
మరిన్ని వార్తలు