నైజీరియన్‌ మోసగాళ్లను తలపించేలా మోసాలు...

17 May, 2019 12:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. షేర్‌ హోల్డర్ల అనుమతి లేకుండా టీవీ9 లోగోను రవిప్రకాశ్‌ అమ్మేయడంపై సాయిరెడ్డి స్పందించారు. ‘అప్పట్లో నట్వర్‌లాల్‌ అనే చీటర్‌ తాజ్‌మహల్‌నే  అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్‌), టీవీ9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్‌ మోసాలు నైజీరియన్‌ మోసగాళ్ళను తలపిస్తున్నాయి. మీడియా 'నయీం' నేరాలపై దర్యాప్తు ఆధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడు. 14 నెలల క్రితం రవి ప్రకాష్‌ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న అగ్రిమెంటు పత్రం తాజాగా సృష్టించినదే అని వెల్లడైంది. చట్టాలంటే ఎంత చులకనో వీళ్లకు.’  అని వ్యాఖ్యానించారు.

23 తర్వాత టీడీపీ ముక్క చెక్కలవుతుంది
అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ పోలింగ్‌ నిర్వహణపై చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేయడంపై కూడా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్‌ బూత్‌లో ఓటర్లకు బదులు ఓ మహిళా అధికారి తానే తృణమూల్‌ గుర్తు బటన్‌ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎన్నికల కమిషన్‌ మెత్తగా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో అదే తరహా రిగ్గింగ్‌కు పాల్పడేవాడు కాదా?.చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు  కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగు అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
గరుడ బ్రోకర్ శివాజీ కూడా తప్పించుకోలేడు

23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.

మరిన్ని వార్తలు