ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది బదిలీ

13 Jun, 2019 11:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీగా ఉన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియా ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా