నూతన గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ

20 Jul, 2019 11:57 IST|Sakshi

ఈనెల 24న గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

సాక్షి, భువనేశ్వర్‌: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందర్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్‌ నివాసానికెళ్లిన ఆయన గవర్నర్‌గా నియమితులైనందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు.


ప్రమాణ స్వీకార ఏర్పాట్లు షురూ..
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందర్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌ వద్ద ఏర్పాట్లును ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్పీ సిసోడియా, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా శనివారం రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. పనులు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించి.. వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 23వ తేదీన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడకు వస్తారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. 24వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఏపీ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు.


Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరిగా రాజరాజేశ్వరి దేవి

చంద్రయాన్‌-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక

డైట్‌ కౌన్సెలింగ్‌లో కేవీ విద్యార్థులకు అన్యాయం

ప్రజా ఫిర్యాదులకు చట్టం

సీఎం జగన్‌ను కలిసిన మాజీ జడ్జి

కదిలే రైలులో మెదిలే ఊహలెన్నో!  

వైఎస్సార్‌ కృషితో ఆ సమస్య తీరిపోయింది

వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటా..

గ్రూప్‌1 అధికారిగా రిటైర్డ్‌ అయ్యి..తాను చదివిన పాఠశాలకు..

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తా

దానిని లోకేష్‌ రాజకీయ నిధిగా మార్చారు..

బెట్టింగ్‌ బంగార్రాజులు

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

వినోదం.. కారాదు విషాదం!

మానవత్వం పరిమళించిన వేళ..

‘ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి’

ట్రిపుల్‌ఐటీ కళాశాల స్థల పరిశీలన

కౌలు రైతులకు జగన్‌ సర్కార్‌ వరాల జల్లు!

నూతన పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా యువ ఎమ్మెల్యే?

ప్రజా సంకల్ప జాతర

ఉన్న పరువు కాస్తా పాయే..!

పాఠశాల ఆవరణలో విద్యార్థికి పాముకాటు..

మత్స్యసిరి.. అలరారుతోంది

చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం

ఎంటెక్కు.. ‘కొత్త’లుక్కు 

కౌలు రైతుల కష్టాలు గట్టెక్కినట్లే

గంజాయి రవాణా ముఠా అరెస్ట్‌

దొంగ దొరికాడు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’