కరోనా కట్టడికి మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు

26 Mar, 2020 13:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. అలాగే క‌రోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట‌ర్ ద్వారా స్పందించారు. ‘ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి ముంగిటకు వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్‌ జగన్ అమలు చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలనపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి’ అని వైఎస్ జ‌గ‌న్ సేవ‌లు కొనియాడారు. (పరీక్షలు లేకుండానే పై తరగతికి)

మ‌రో ట్వీట్‌లో అసెంబ్లీ, రెవిన్యూ డివిజన్, జిల్లా స్థాయిల వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం, స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేయడం ప్రభుత్వ ముందు జాగ్రత్తలను సూచిస్తోంది. అని ట్వీట్ చేశారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అధికారులను వేగంగా స్పందిస్తూ.. వైరస్‌ నిరోధానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. మరోవైపు వైరస్‌ కట్టడికి రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు