‘పార్టీని గెలిపించడంలో ఆయన కృషి ఎనలేనిది’

1 Jul, 2020 11:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంతో కృషి చేశారని పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటూ రాష్డ్రాభివృద్దిలో, సంక్షేమ పాలనలో కీలక భూమిక‌ పోషిస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు బుధవారం సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి .ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మంత్రి అవంతి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని.. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతున్నారని అన్నారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిన నేత విజయసాయిరెడ్డి అని కొనియాడారు. (ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు)

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారన్నారు. పెద్దవయస్సులోనూ విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తుంటే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కరోనా కు భయపడి ఇంట్లో ఉంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల‌నాగిరెడ్డి, వంశీ‌కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కెకె రాజు, గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు. (ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభం)

అదే విధంగా.. ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు కాంతారావు ఆద్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.  ఈ వేడుకల్లో భారీ కేక్ కట్టింగ్ చేశారు. చింతపల్లిలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జల్లు సుధాకర్ ఆధ్వర్యంలో అభిమానులు కేక్ కట్ చేశారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా