దసరా ఉత్సవాలకు కట్టుదిట్ట ఏర్పాట్లు

27 Sep, 2019 20:57 IST|Sakshi

విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో దసరా ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించామని వెల్లడించారు. 29న ఆదివారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. మూల నక్షత్రం రోజున 3 లక్షల మంది  భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనేదే లక్ష్యమని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్‌ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక సమయాలు కేటాయించామని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, ఉదయం 11 నుంచి 12 గంటల వరుకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరుకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. విఐపిలతో పాటు సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. విఐపి ప్రోటోకాల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్, పున్నమి ఘాట్, ప్రోటోకాల్ పాయింట్స్ లను  విఐపిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

‘దసరా పార్కింగ్‌ యాప్‌- 2019’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ యాప్‌తో పార్కింగ్‌ సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో మోబి జెన్‌ యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మొత్తం 12 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు అమ్మవారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామన్నారు. గత ఏడాది ఎక్కడా చోరీలు జరగలేదని. ఈ ఏడాది కూడా క్రైం పార్టీలను పెంచుతామన్నారు. దాతలకు కూడా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసామని.. 10 రోజుల్లో ఏ రోజు అయినా దర్శనం చేసుకోవచ్చన్నారు

90 శాతం ఏర్పాట్లు పూర్తి:ఈవో 
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో సురేష్‌బాబు అన్నారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కేశన ఖండనశాల పనులు పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. క్యూలైన్‌ పనులు రేపటికి పూర్తవుతాయని..అన్యమతస్థులకు టెండర్లు ఇవ్వలేదని ఈవో తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

పయ్యావుల కేశవ్ అత్యుత్సాహం

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

‘విద్య పరమైన రిజర్వేషన్లకు జాతి గణన’

చంద్రబాబు స్విమ్మరా? డ్రైవరా..?

‘ప్రయాణికులను కాపాడిన స్థానికులకు ఆర్థిక సాయం’

వైఎస్‌ జగన్ పాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగదు

‘చంద్రబాబుకు పిచ్చిపట్టింది’

అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ ద్వారా ఏటా రూ.10 వేలు

‘సీఎం జగన్‌ మహిళా పక్షపాతి’

అవాస్తవాలు రాస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు

చంద్రబాబు గగ్గోలుకు ఆంతర్యం ఏమిటో?

‘అందుకే లోకేష్‌ను ప్రజలు ఓడించారు’

ప్రాక్టికల్‌ మాయ

పోలవరంపై ఎన్జీటీలో విచారణ

ఎన్నెన్నో.. అందాలు

సరికొత్త ‘పట్టణం’

కిలో ఉల్లి రూ.25

5న దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు

సీఎంకు ఆర్టీసీ నిపుణుల కమిటీ నివేదిక

అన్నీ సం‘దేహా’లే..!

జల సంరక్షణలో మనమే టాప్‌

ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు..

టీడీపీ నేతల వక్రబుద్ధి

కాటేస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

రేపే ‘సామజవరగమన’

అప్పటికీ ఇప్పటికీ అదే తేడా : రాజమౌళి

గ్రెటాకు థ్యాంక్స్‌.. ప్రియాంకపై విమర్శలు!

హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్‌..!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ