కిలి‘మజారో..’

22 Aug, 2014 02:54 IST|Sakshi
కిలి‘మజారో..’
  • ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణ చేసిన విజయవాడ వైద్యుడు
  •   గత ఏడాది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన వైనం..
  • ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన పర్వతం.. ఎముకలు కొరికే చలి.. ఆక్సిజన్ అందక తలనొప్పి.. కళ్లు తిరగడం.. మధ్యమధ్యలో అటవీ ప్రాంతం.. సందర్శకులకు ఇది కాస్త భయూనక వాతావరణమే అయినా.. సాహసీకులకు మాత్రం ఓ మంచి టూరింగ్ స్పాట్. ఇంతటి భయంకరమైన పర్వతాన్ని తేలిగ్గా అధిరోహించారు విజయవాడకు చెందిన ఎండ్రోక్రైనాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ మెహర్. ఆఫ్రికాలోని కిలిమంజారో (5,985 మీటర్లు) పర్వతాన్ని ఐదు రోజుల్లో సునాయూసంగా ఎక్కేశారు. ఇటీవల విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..    
     
    - విజయవాడ

     
     ‘ఏటా స్నేహితులతో కలిసి ఏదో ఒక ప్రాంతంలో పర్యటించడం ఆనవాయితీ. పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాకుండా జీవితంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలే ప్రాంతాలకు వెళ్లాలనేది నా ఆకాంక్ష. అందుకనుగుణంగా మూడేళ్లుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. రెండేళ్ల కిందట అమెరికాలోని రిమ్ టు రన్‌ను సందర్శించాను. గత ఏడాది 5,500 మీటర్ల ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పర్యటించా. తాజాగా ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తై పర్వతం కిలిమంజారోను అధిరోహించాను. పర్వతారోహణ చేసే వారికి శారీరక ధృడత్వంతో పాటు మానసిక స్థైర్యం అవసరమని నేను తెలుసుకున్నాను.
     
    అడుగడుగునా ఎంతో థ్రిల్లింగ్..

    నా స్నేహితులు, అమెరికాలో స్థిరపడిన వంశీ, శశితో కలిసి ఈ నెల నాల్గో తేదీన ఆఫ్రికా చేరుకున్నాను. అక్కడ ఉన్న ఎత్తై పర్వతం కిలిమంజారోను అధిరోహించేందుకు నిర్ణయించుకుని అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశాం. ఐదో తేదీన పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించాం. ఐదు రోజుల పాటు నిరాటంకంగా ఎక్కాం. రాత్రివేళల్లో టెంట్లు వేసుకుని ఉండేవాళ్లం. ఉదయాన్నే బిస్కెట్లు తిని అధిరోహణ ప్రారంభించేవాళ్లం. ఇలా ఐదు రోజులు 5,985 మీటర్ల ఎత్తున్న పర్వతాన్ని అధిరోహించాం. అడుగడుగునా ఎంతో థ్రిల్‌కు గురయ్యూ. గత ఏడాది ఎవరెస్ట్ బేస్ (5,500 మీటర్లు) ఎక్కేందుకు ఎనిమిది రోజుల సమయం పట్టగా, అప్పటి అనుభవాలతో ఐదు రోజుల్లో కిలిమంజారో అధిరోహించాం.
     
    వాతావరణంలో ఎన్నో మార్పులు

    తొలిరోజు పెద్దపెద్ద చెట్లు ఉండే ప్రాంతంలో తిరిగాం. అక్కడ వర్షం పడుతూనే ఉంది. ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంది. రెండోరోజు మూన్ కైన్ట్.. అంటే చిన్న చెట్లు, వణికించే చలి ఉంది. మూడోరోజు సెమి డిజర్ట్ అంటే.. చెట్లు తక్కువగా, రాళ్లు రప్పలు ఎక్కువగా కనిపించాయి. నాల్గోరోజు ఆల్పెన్ డిజార్ట్, ఐదోరోజు అర్కేట్లు.. ఇలా వాతావరణంలో మార్పులు కనిపించాయి. చివరి రెండు రోజుల్లో ఆక్సిజన్ సరిగా అందక తలనొప్పి, వాంతులు, ఆకలి లేకపోవడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించారుు.. అని మెహర్ రమేష్ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.    

    - విజయవాడ
     

మరిన్ని వార్తలు