ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు

20 Feb, 2020 19:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున సభ్యులను నియమించారు. మూడు ఆలయాల్లోని ప్రధాన అర్చకులు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింహాచలం, ద్వారకా తిరుమలలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించింది. దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌గా పైలా సోమినాయుడును ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు ఆలయాల పాలకమండళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. (చదవండి: 29 నుంచి ‘అరకు ఉత్సవ్‌’)

విజయవాడ: దుర్గ గుడి పాలక మండలి సభ్యులు
1. పైలా సోమినాయుడు
2. కటకం శ్రీదేవి
3. డీఆర్‌కే ప్రసాద్‌
4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ
5. పులి చంద్రకళ
6. ఓవీ రమణ
7. గంటా ప్రసాదరావు
8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి
10. కార్తీక రాజ్యలక్ష్మి
11. నేటికొప్పుల సుజాత
12. నేలపట్ల అంబిక
13. కానుగుల వెంకట రమణ
14. నెర్సు సతీశ్‌
15. బండారు జ్యోతి
16. లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ (పధాన అర్చకుడు)

ద్వారకా తిరుమల: వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్‌)
2. మాతూరు శ్రీవల్లీ
3. గ్రంథి శేషగిరిరావు
4. కర్పూరం గవరయ్య గుప్తా
5. గూడూరి ఉమాబాల
6. కనకతాల నాగ సత్యనారాయణ
7. కొండేటి పద్మజ
8. కొత్తా విజయలక్ష్మి
9. చిలువులూరి సత్యనారాయణరాజు
10. కుంజా శాంతి
11. నందిని బందంరావూరి
12. మనుకొండ నాగలక్ష్మి
13. జి. సత్యనారాయణ
14. మేడిబోయిన గంగరాజు
15. వీరమళ్ల వెంకటేశ్వరరావు
16. పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథ ఆచార్యులు (ప్రధాన పూజారి)

సింహాచలం: లక్ష్మీనరసింహ దేవస్థానం పాలక మండలి సభ్యులు
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్‌)
2. దాడి దేవి
3. వారణాసి దినేశ్‌రాజ్‌
4. నల్లమిల్లి కృష్ణారెడ్డి
5. జి. మాధవి
6. గడ్డం ఉమ
7. రాగాల నర​సింహారావు నాయుడు
8. దాడి రత్నాకర్‌
9. సూరిశెట్టి సూరిబాబు
10. రంగాలి పోతన్న
11. సంచిత గజపతిరాజు
12. దొనకొండ పద్మావతి
13. నెమ్మాడి చంద్రకళ
14. సిరిపురపు ఆశాకుమారి
15.  విజయ్‌ కే. సోంధి
16. గొడవర్తి గోపాల కృష్ణామాచార్యులు (ప్రధాన అర్చకుడు)

మరిన్ని వార్తలు