ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం

8 Feb, 2020 18:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం​‍-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు.

అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్‌ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్‌ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు