భయపడొద్దు.. వారు కరోనా పేషెంట్లు కాదు

25 Mar, 2020 08:09 IST|Sakshi
అంగళ్లులో గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త

గ్రామస్తులకు సర్దిచెప్పిన కలెక్టర్‌

కురబలకోట : క్వారెంటైన్‌ సెంటర్‌లో కరోనా వైరస్‌ పేషెంట్లు ఉండరని, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త అన్నారు. తంబళ్లపల్లె నియోజక వర్గానికి సంబంధించి అంగళ్లులోని గోల్టన్‌వ్యాలీ కళాశాల, విశ్వం కళాశాలలో క్వారెంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని పరిశీలించడానికి ఆయన మంగళవారం తొలుత విశ్వం కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ సెంటర్‌  ఏర్పాటు చేస్తే తమకు సోకుతుందేమోనని పరిసర గ్రామాల వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెంటర్‌ వద్దంటూ ధర్నా, ఆందోళనకు దిగారు.

తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇందుకు కలెక్టర్‌ స్పందిస్తూ  తాను కూడా డాక్టరేనని..గాలి ద్వారా కరోనా వైరస్‌ సోకదని తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారిని  స్క్రీనింగ్‌ చేసిన అనంతరం కొన్నాళ్లు ఉంచి తిరిగి పంపేస్తారని చెప్పారు. కరోనా పేషేంట్లను ఇక్కడ ఉంచరన్నారు. అపోహాలు వీడి అధికారులకు సహకరించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆయన గోల్డన్‌వ్యాలీ కళాశాల సెంటర్‌ను పరిశీలించారు. గోల్డ¯న్‌ వ్యాలీ కళాశాల పరిసర గ్రామాల వారు కూడా ఈ సెంటర్‌ ఏర్పాటు çపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారులు ఇక్కడే సెంటర్‌ కొనసాగడానికి చర్యలు తీసుకున్నారు. పోలీసులు గ్రామస్తులకు అవగాహన కల్పించి పంపేశారు .
 

మరిన్ని వార్తలు