రీ పోలింగ్ కోసం గ్రామస్తుల ఆందోళన

1 Aug, 2013 04:23 IST|Sakshi

రాయపర్తి, న్యూస్‌లైన్ : రీ పోలింగ్ నిర్వహించాలం టూ కేశవాపురం గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మొ లుగూరి పున్నమయ్య, టీడీపీ బలపర్చిన అభ్యర్థి గా జుల సరోజన, టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జలగం కరుణాకర్ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కాగా, పది వార్డుల్లో ఎనిమిది టీఆర్‌ఎస్, ఒకటి కాం గ్రెస్, ఒక టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే కాం గ్రెస్ అభ్యర్థి పున్నమయ్యకు 555, సరోజన(టీడీపీ) 510, కరుణాకర్(టీఆర్‌ఎస్) 465 ఓట్లు వచ్చాయి.
 
  అన్ని వార్డులు టీఆర్‌ఎస్ గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ గెలుపుపై టీఆర్‌ఎస్ నాయకులకు అనుమానం వ్యక్తం చేశారు. ఇంతలోనే బూత్ పక్కనే కిటికీ వద్ద చింపిన పోలింగ్ చిట్టీలు కనిపించడంతో ఆందోళనకు దిగారు. దీంతో రంగప్రవేశం చేసిన మామునూర్ డీఎస్పీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు రీపోలింగ్ ని ర్వహించాలని ఆందోళన చేశారు. అధికారులు పున్నమయ్యను సర్పంచ్‌గా ప్రకటించి వెళ్లిపోయారు.
 
 బంధనపల్లిలో...
 బంధనల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి అడ్డాల సంధ్యారాణిని ఎన్నికల అధికారులు రెండు ఓట్ల తేడా తో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, అనుమానం వచ్చిన ఆమె బంధువులు, పార్టీ నాయకు లు పోలింగ్ కేంద్ర పరిసరాల్లో పరిశీలించగా చిరిగిపోయిన బ్యాలెట్ పత్రం కనిపించింది. దీంతో ఎన్నికల అధికారులు కాంగ్రెస్ అభ్యర్థి కౌడగాని ఉమకు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
 
  వెంటనే రీకౌంటింగ్ చేపట్టాలని, అప్పటి వరకు ఎన్నికల సిబ్బంది వెళ్లేది లేదంటూ అడ్డుతగిలారు. విష యం తెలుసుకున్న వరంగల్ ఆర్డీఓ జె.మధు, మామునూర్ డీఎస్పీ సురేష్‌కుమార్, వర్ధన్నపేట సీఐ మ ల్లయ్య సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు న చ్చజెప్పాలని ప్రయత్నించినప్పటికీ ససేమిరా అం టూ భీష్మించారు. దీంతో చేసేది లేక టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి నుంచి దరఖాస్తు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.

మరిన్ని వార్తలు