బెల్టుషాపుపై గ్రామస్తుల దాడి

19 Feb, 2017 11:06 IST|Sakshi

వరికుంటపాడు(నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో నిర‍్వహిస్తున‍్న బెల్టుషాపుపై ఆదివారం ఉదయం గ్రామస‍్తులు దాడిచేశారు.

మద‍్యపానానికి వ‍్యతిరేకంగా జడదేవి గ్రామస‍్తులు ఇటీవల తీర్మానించారు. అయితే అందుకు విరుద్ధంగా ఒక దుకాణంలో దొంగచాటుగా మద‍్యం విక్రయిస్తున్నారని గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం ఆ దుకాణంపై దాడిచేసి మద‍్యం సీసాలను ధ‍్వంసం చేశారు. ఇకపై గ్రామస్తుల తీర్మానానికి వ‍్యతిరేకంగా బెల్టుషాపు నిర‍్వహిస‍్తే కఠినచర‍్యలు తీసుకుంటామని హెచ‍్చరించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా