ఉపాధ్యాయులకు దేహశుద్ధి? 

3 Aug, 2019 10:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో ఇద్దరు  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారన్న వదంతులు వ్యాపించడంతో శుక్రవారం గ్రామంలో కలకలం రేగింది. అయితే తమ గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ జి.రామారావును వివరణ కోరగా గురువారం పాఠశాల వద్ద ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెళ్లి విచారణ జరిపానని చెప్పారు. తన విచారణలో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారని వారిలో ఒక విద్యార్థినికి  గాయాలవ్వడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై అడగడానికి వచ్చామని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్‌ అనే ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలలకు మార్చమని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు పెట్టడంతో డెప్యుటేషన్‌పై  మరో ఉపాధ్యాయినిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులపై చాలాకాలంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన సంఘటనలో కూడా పాఠశాలలో అసాంఘిక చర్యలకు పాల్పడటంతోనే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చెలరేగి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి జరిమానా కూడా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవిని వివరణ కోరగా శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతానని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రభుత్వం అండతో మద్య నిషేధం అమలు 

విద్యార్థి మృతదేహం లభ్యం

సం‘జీవన్‌’ కావాలి!

పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం

చోరి చేశాడనే అనుమానం‍తో బాలుడిపై...

విజయవాడలో చినుకుపడితే రోడ్లు ఛిద్రమే..

అయ్యా.. మాది ఏ కులం?

జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: విజయసాయి రెడ్డి

‘ముక్క’మాటానికిపోయి.. 

ఎన్‌ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే..

ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద 

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మారుతి అరెస్ట్‌

మహిళా ప్రగతి కేంద్రంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ

బాపట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

నా రూటే.. సపరేటు ! 

బలవంతంగా స్కూల్‌కి.. బస్సులోంచి దూకేశాడు

ముసురు మేఘం.. ఆశల రాగం..

కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్‌ 

ప్రభుత్వాస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం

బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్రి ప్రమాదం

తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలకు సంపూర్ణ మద్దతు

పరిశ్రమల స్వర్గధామం ఏపీ 

సెప్టెంబర్‌ 8న కూడా సచివాలయాల పరీక్ష

7,966 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ 

కన్సల్టెన్సీలకు స్వస్తి 

పోలీసులూ.. ప్రజా సేవకులే!

నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!

వానొచ్చె.. వరదొచ్చె..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ