పల్లె ప్రగతి 

27 Jun, 2020 09:09 IST|Sakshi
గిరిజన గ్రామాల్లో రహదారి పనులు (ఇన్‌సెట్‌లో) నాడు–నేడు కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు

ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులతో మారుతున్న రూపురేఖలు 

నిర్మాణంలో సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు 

రూ. కోట్లాది నిధులతో జోరుగా రహదారుల నిర్మాణం

వివిధ దశల్లో 687 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం

1145 పాఠశాలల్లో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు

మన పల్లె ప్రగతి బాట పయనిస్తోంది. కోట్లాది రూపాయల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో గ్రామాలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనులతో గ్రామాల రూపురేఖలు శరవేగంగా మారిపోతు న్నాయి. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. ఒకవైపు పాలనా వ్యవస్థలో మార్పులు, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరుగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రజల ముంగిటకే అందుబాటులోకి వచ్చింది. చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యమే పర మావధిగా వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నా యి. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ దశలవారీగా సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సహాయంతో ఈ భవనాల నిర్మాణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోంది. 

పనుల్లో పురోగతి 
జిల్లాకు రూ.243.82కోట్లతో 663 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాల్సి ఉండగా 436 భవనాల నిర్మా ణం ప్రారంభమయ్యింది. రూ.130.36కోట్లతో 567 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా తొలివిడతలో 384 భవనాల నిర్మాణాన్ని చేపడుతుండగా, వీటి లో ఇప్పటికే 68 భవనాల పనులు ప్రారంభమయ్యా యి. 585 వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణానికి రూ.74కోట్లు మంజూరుకాగా 41 సెంటర్ల  నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాకు ఇదివరకే 702 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు కాగా, వీటిలో 687 కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకోసం రూ.32.89కోట్లు మంజూరవ్వగా రూ.32.70కోట్లు నిర్మాణ సామగ్రికి, రూ.19.96లక్షలు వేతనదారులకు కేటాయించారు. మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా 1145 పాఠశాలలకు రూ.70.54కోట్లతో ప్రహరీలు మంజూరు చేయగా, వీటిలో 634 పనులు వివిధ దశల్లో ఉన్నా యి. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా జోరందుకుంది.

గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాన్ని ఉపాధిహామీ భాగస్వామ్యంతో చేపట్టారు. ముఖ్యంగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంపై దృష్టిసారించి రహదారి సౌకర్యాన్ని కలి్పస్తున్నారు. గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా మరోవైపు చేపడుతున్నారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనుల్లో భా గంగా జిల్లా వ్యాప్తంగా 17,904 సిమ్మెంటు కాంక్రీట్‌ రోడ్లు మంజూరు చేశారు. వీటి అంచనా విలువ సుమారుగా రూ.673.37కోట్లు కాగా, ఇప్పటివరకు 13,394 పనులు మొదలు పెట్టారు. అలాగే 81.46 కోట్లతో 117 బీటీ రోడ్లను మంజూరు చేయగా, ఈ పనులన్నీ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రూ.156.17కోట్ల తో 548 డబ్ల్యూబీఎం రోడ్లను మంజూరు చేయగా, వీటిలో 234 రహదారుల నిర్మాణం ప్రారంభమయ్యింది. 

ఆగస్టు నాటికి అన్నీ పూర్తి
గ్రామ పరిపాలనకు కేంద్రస్థానమైన గ్రామ సచివాలయానికి తగిన వసతులతో, అవసరమైన విస్తీర్ణంతో భవనాలను నిర్మిస్తున్నాం. చాలాచోట్ల వీటిని ఆనుకునే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడా కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలకు స్థలం కొరత కారణంగా ఇంకా ప్రారంభం కానప్పటికీ, వీటన్నిటినీ ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న కతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లాకలెక్టర్‌  

మరిన్ని వార్తలు