‘ఓటు’ విలువ మారకుండా చూడండి

17 Jun, 2017 01:55 IST|Sakshi
‘ఓటు’ విలువ మారకుండా చూడండి

ఎమ్మెల్యేల ఓటుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ వినోద్‌ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఎమ్మెల్యేల ఓటు విలువ మారకుండా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నసీం జైదీకి శుక్రవారం లేఖ రాశారు.

గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా విభజన తర్వాత ఏపీ ఎమ్మెల్యే ఓటు 159కి పెరిగిందని, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132కు తగ్గిందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిందని, అందువల్ల 1971 జనాభా లెక్కల ఆధారంగా కొత్త రాష్ట్రాల జనాభా లెక్కకట్టడం అశాస్త్రీయమన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం, ఎన్నికల సంఘం తెలంగాణకు నష్టం వాటిల్లకుండా రాజ్యాంగంలోని 55(2) అధికరణను సవరించాలని కోరారు.

మరిన్ని వార్తలు