వినుకొండ ఫారెస్ట్ రేంజ్ రెండు ముక్కలు

10 Jun, 2014 01:41 IST|Sakshi
వినుకొండ ఫారెస్ట్ రేంజ్ రెండు ముక్కలు

- నూతనంగా కోటప్పకొండ రేంజి ఏర్పాటు
- విభజనతో అడవులకు పూర్తిస్థాయి రక్షణ
- పెరగనున్న ఉద్యోగ అవకాలు

వినుకొండ: వినుకొండ అటవీశాఖ రేంజి రెండు ముక్కలు కాబోతోంది. కోటప్పకొండ రేంజిని కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల నిఘా మరింతగా పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. వినుకొండ రే ంజి పరిధిలో 44,830 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి.

విభజనలో భాగంగా వినుకొండ రే ంజి పరిధిలో 32,421.76 హెక్టార్లు, కోటప్పకొండ రేంజి పరిధిలో 12,408.24 హెక్టార్ల అడవులు ఉంటాయి. విభజన ప్రకటన కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉందని రేంజి అధికారి వి.వి.రమణారావు తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న వినుకొండ రేంజి పరిధి మేళ్ళవాగు నుంచి నరసరావుపేట వరకు ఉంది. రేంజి పరిధి తగ్గించడం వల్ల అడవులు, వణ్యప్రాణుల సంరక్షణ పూర్తి స్థాయిలో చేసేందుకు, ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో వినుకొండ రేంజి పరిధిలో ఐదు సెక్షన్‌లు, 18 బీట్లు ఉన్నాయి.

విభజన అనంతరం కోటప్పకొండ రేంజ్ పరిధిలో 3 సెక్షన్‌లు, 12 బీట్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. గతంలో గుంటూరు రేంజి పరిధిలోని నకరికల్లు సెక్షన్‌ను కోటప్పకొండ రేంజిలో విలీనం చేశారు. అదేవిధంగా చేజర్ల బీటు, బొల్లాపల్లి మండల పరిధిలోని గరికపాడు, మేళ్లవాగు, జయంతిరామపురం బీట్లు కోటప్పకొండ రేంజి పరిధిలో ఉంటాయి. ఇప్పటి వరకు వినుకొండ రేంజి పరిధిలో ఉన్న కారంపూడి సెక్షన్ మాచర్ల రేంజిలో కలిపారు.
 
విస్తీర్ణం అధికంగా ఉన్నందునే...
 వినుకొండ రేంజి విస్తీర్ణం అధికంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో అడవులను కాపాడలేకపోతున్నాం. రెండుగా విభజించడం వల్ల అడవుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కోటప్పకొండ రేంజి ఏర్పా టు జరగడం వల్ల కొత్తగా రిక్రూట్‌మెంట్ నిర్వహించారు. వీరికి త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. వినుకొండ రేంజిని రెండుగా విభజించారు. అయితే వినుకొండ రేంజి పరిధిలో గతంలో ఉన్న సెక్షన్లు, బీట్లు యదావిధగా ఉంటాయి. అలాగే ఉద్యోగులు కూడా యథావిధిగానే ఉంటారు.
 - వి.వి.రమణారావు,
 ఫారెస్టు రేంజి అధికారి, వినుకొండ

మరిన్ని వార్తలు