చట్టాన్ని అతిక్రమిస్తే ఇంటికే

10 Jan, 2014 02:09 IST|Sakshi

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: చట్టాన్ని అతిక్రమించి పనులు చేస్తే కమిషనర్లు ఇంటికి వెళ్లాల్సిందేనని మున్సిపల్ ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ హెచ్చరించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న సీఆర్‌సీ భవనంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ఆర్‌డీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం అని తెలిసినా ఆలస్యంగా వస్తున్న కమిషనర్లు, ఇంజనీర్లను ఇది చివరి హెచ్చరికగా చెప్పారు. పన్నుల వసూలులో వెనుకబడ్డ మున్సిపల్ కమిషనర్లను తీవ్రంగా మందలించారు.  
 
 తక్కువ పన్ను వసూలులో
 జమ్మలమడుగు రెండో స్థానం
 జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఇప్ప టి వరకు 20 శాతం పన్ను వసూలు చేశారని, ఏమి చేస్తున్నారని కమిషనర్ రాజు ను ఆర్‌డీ ప్రశ్నించారు. జీతాలు అవసరం లేదని అనుకుంటే పన్ను వసూలు లో నిర్లక్ష్యం చేయాలని చెప్పారు. ఆర్‌ఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రీజియన్‌లో అత్యంత అధ్వానంగా ఉన్నది మొదట నగరి, రెండవది జమ్మలమడుగేనని అన్నారు. జనవరి చివరకు 50 శాతం, ఫిబ్రవరి నెలాఖరుకు 80శాతం వసూలు చేయాల్సిందేనని చెప్పారు. రా యచోటి కూడా 22 శాతమే పన్ను వసూ లు చేసిందని నెలాఖరుకు 50, ఫిబ్రవరికి 75 శాతం వసూలు చేయాలని ఆర్‌డీ కమిషనర్‌కు క్లాస్ తీసుకున్నారు.  బద్వే లు మున్సిపాలిటీ 31శాతం వసూలు చేసిందన్నారు. జనవరికి 60, ఫిబ్రవరికి 80 శాతం వసూలు చేయాలన్నారు. ఎర్రగుంట్ల కొత్త మున్సిపాలిటీలో కూడా 30శాతం పన్ను వసూలు చేయడం ఏమిటని కమిషనర్ ప్రభాకర్‌ను ప్రశ్నించారు.
 
  రాజంపేటలో 32 శాతం వసూలు చేశారని జనవరికి 60శాతం, వసూలు చేయాలన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పన్నులు వసూలు చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని కమిషనర్‌ను ప్ర శ్నించారు. పులివెందుల, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్ 49 శాతం నుంచి 50శాతం వరకు వసూలు చేసి ముందంజలో ఉన్నాయని జనవరి కంతా 70శాతం, ఫిబ్రవరికి 90శాతం పన్ను వసూలు చేయాలని కమిషనర్‌లు వెంకటక ృష్ణ, చంద్రమౌళీశ్వరరెడ్డిలకు సూచించారు. నీటి పన్ను కూడా కడప, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు చాలా తక్కువగా వసూలు చేస్తున్నాయని కమిషనర్లు దృష్టి సారించాలన్నారు.   
 
 ఇంజినీర్లపై ఎస్‌ఈ ఆగ్రహం
 ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, నాన్‌ప్లాన్‌గ్రాంట్, ప్లాన్‌గ్రాంట్, స్టేట్ ఫైనాన్స్ పనులు ఏ మున్సిపాలిటీకి ఎన్ని, ఎంత విలువతో మంజూరయ్యాయి, వాటి పురోగతి ఏమిటనే విషయంపై ఎస్‌ఈ మోహన్ ప్రశ్నించగా ఏ మున్సిపల్ ఇంజినీర్లు స మాచారం తీసుకురాలేదని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లు కూ డా సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పారు.  ఈ సమావేశంలో పబ్లిక్‌హె ల్త్ ఈఈ నగేష్, మున్సిపల్ ఎంఈలు, ఈఈలు, డీఈలు, అకౌంటెంట్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు