3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

2 Oct, 2015 03:27 IST|Sakshi

సాక్షి, తిరుమల: రద్దీ కారణంగా శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం గాంధీ జయంతి, పెరటాశి నెలలో మూడో శనివారం, ఆదివారం సెలవు కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు సిఫారసు లేఖలకు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. ఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రమే తక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయిస్తారు.
 నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో
 ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. తిరుమలలో ఎదురయ్యే సమస్యలు, సూచనలను భక్తులు 0877-2263261కు డయల్ చేసి టీటీడీ ఈవో డి.సాంబశివరావుకు ఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చు.

మరిన్ని వార్తలు