వెలుగు నీడలు

28 Dec, 2014 00:08 IST|Sakshi
వెలుగు నీడలు

 VIP  రిపోర్టర్
     
గుండె జబ్బులోళ్లను బాగా సూత్తన్నారు
{పసూతి వార్డులో బెడ్స్ సరిపోడం లేదు
బాత్‌రూమ్‌లు శుభ్రంగా ఉండాలి

 
పెద్దాస్పత్రి.. 1823లో చిన్న ఆస్పత్రిగా ప్రారంభమై 1923లో కింగ్ జార్జ్ హాస్పటల్‌గా అవతరించింది. 25 విభాగాల్లో వందలాది మంది వైద్య సిబ్బందితో ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి రోజు సగటున రెండు వేలమంది చికిత్స పొందే ఈ వైద్యాలయంలో అనేక సదుపాయాలున్నాయి. రోగులకు సాంత్వన అందించాలన్న సేవాభావముంది. వీటితోపాటు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే కింగ్‌జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదనబాబు ‘సాక్షి’ తరపున ‘వీఐపీ రిపోర్టర్’గా మారారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో కలియతిరుగుతూ రోగులు, వైద్యులు, సిబ్బందిని పలకరించారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన వైద్య సేవలు కల్పిస్తామని రోగులకు భరోసా ఇచ్చారు.
 
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందించడంతోపాటు వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉంది. మొత్తానికి 1100 మంది నర్సులు అవసరం కాగా కేవలం 204మందే ఉన్నారు. ప్రసూతి వార్డుల్లో సరిపడా పడకలు లేవు. దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నాం. మిగతా వార్డుల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే మరిన్ని సదుపాయాలు కల్పించడానికి, కొత్త భవనాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం.
 -డాక్టర్ ఎం.మధుసూదనబాబు, సూపరింటెండెంట్,
 కింగ్‌జార్జ్ హాస్పటల్
 

మరిన్ని వార్తలు